గీతా - మాతా

అమ్మ -స్వచ్ఛమైన ప్రేమకు మారు పేరు అమ్మ - పవిత్ర ప్రేమకు ప్రతీక, అమ్మ- స్వేచ్ఛా స్వతంత్ర్యాలను ప్రసాదించేది. ఆలంబనకు, ఆప్యాయతకు అమ్మే ఆధారం. ప్రమాదంలోను ప్రమోదం లోను అమ్మే సాక్ష్యం. అమ్మ అంటే ప్రకృతి. ఒకసారి కల్లోలం, మరోసారి నిశ్శబ్దం. "అతి సర్వత్రా వర్జయేత్" అన్నట్లుగా ఏదైనా పరిమితిని దాటితే హానికరం. నియంత్రణ, నివారణ అమ్మ యొక్క సహజ స్వభావం.
స్వామి వివేకానందుడు చెప్పినట్లు నీ చేత గీతలను నీవే మార్చుకో దానంతట అదే నీ రాత మారుతుంది. అదెలాగో అగమ్య గోచరంలో ఉన్నపుడు నాకు కనపడిన ఒకే ఒక మార్గం జ్ఞానం. అమ్మ లోని దార్శికత ధార్మికతలా, నాలోని అజ్ఞానానికి కాగడలా గీతాచార్యుడు బోధించిన గీతా మకరందం ఆర్తిని తీర్చింది. పరమపవిత్రమైన గీతను పరిచయం చేసిన గురువులందరికీ నమస్సుమాంజలులు.
అమ్మ, చేయి పట్టుకుని నడక ఎలా నేర్పించిందో అలాగే వైతరణిని దాటించగలిగే రహస్యం బోధించే మాత పూజనీయ గీత "భగవద్గీత":
కొన్ని సార్లు ఏం చేయాకూడదో తెలిస్తే మార్గం, ప్రయాణం సుగమం అవుతుంది. స్థిరత్వం, చంచలత్వం; ప్రేమ, ద్వేషం; దయ, క్రూరత్వం ద్వంద్వాలు మానవులకు సహజ సిద్ధమైన అనుభవాలు, భావాలు. వీటినియంత్రణకు దిక్సూచి, సరళతనూ, స్థిరత్వాన్ని, నిస్వార్ధాన్ని, స్వేచ్ఛనూ
ముక్తే పరమగమ్యం అని బోధించే గీతా - మాత అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ గీతను -
చదువు,చదివించు, అన్వయించు అనే నినాదంతో సులభమైన,
సరళమైన రీతిలో నేర్పిస్తున్న "గీతా పరివార్" వారికి
- Smt. Uma Rani Tavva, Telangana
